37వ అంత‌ర్జాతీయ పారిశ్రామిక ప్ర‌ద‌ర్శ‌న‌(ఐఐటీఈ) ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదానంలో ఈ వేళ ప్రారంభ‌మ‌యింది. ఇండియా ట్రేడ్ ప్ర‌మోష‌న్ ఆర్గ‌నైజేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట‌య్యే ఈ 14 రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌ను రాష్ర్ట‌ప‌తి రాంనాథ్ కోవింద్ ప్రారంభించారు.

37వ అంత‌ర్జాతీయ పారిశ్రామిక ప్ర‌ద‌ర్శ‌న‌(ఐఐటీఈ) ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదానంలో ఈ వేళ ప్రారంభ‌మ‌వుతుంది. ఇండియా ట్రేడ్ ప్ర‌మోష‌న్ ఆర్గ‌నైజేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట‌య్యే ఈ 14 రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌ను రాష్ర్ట‌ప‌తి రాంనాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. స్టార్ట‌ప్ ఇండియా- స్టాండ‌ప్ ఇండియా నినాదంతో  ఈ ఏడాది ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాట‌వుతుంది. వియ‌త్నాం ప్రాథ‌మిక దేశం కాగా, కిజిస్థాన్ ప్రాథ‌మిక దేశంగా ఉంది. ఝార్ఖండ్ భాగస్వామ్య రాష్ట్రంగా ఉంది. 22 దేశాలకు చెందిన 7 వేల మందికి పైగా తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రగతి మైదాన్ గేట్ల వద్ద టికెట్లు అందుబాటులో ఉండవని, ఆన్లైన్ లేదా మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయాలనీ ITPO తెలియచేసింది. వయో వృద్ధులకు దివ్యంగులకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు.