కేరళలో అత్యధిక వర్షపాతం వల్ల మరణింటిన వారి సంఖ్య 19కి చేరింది. కేరళ తీరంలో 690 మంది మత్స్య కారులను ఇప్పటి వరకు రక్షించారు.

ఓకి తుపాను లక్ష దీవులకు వాయువ్య దిశగా పయనించడంతో ఆ ప్రాంతానికి తుపాను, భారీ వర్షాలు నుండి ఉపశమనం కలిగినట్లయింది. బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేరుక్కుగ్గా కొనసాగుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న మినికోయ్, కల్సెనీ దీవుల్లో ఈ సహాయ కార్యక్రమాలు మరో రెండు వారాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రం ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైన తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందనివాతావరణ కేంద్రం తెలిపింది. గుజరాత్ దక్షిణ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ వర్షం పడవచ్చునని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లక్ష దీవులు, పరిసర ప్రాంత మత్స్య కారులు చేపల వేటకు సముద్రానికి వెళ్లరాదని హెచ్చరించింది.

ఇదిలాఉండగా.. కన్యాకుమారి వద్ద రెండు పడవల్లో సముద్రంలో చిక్కుకుపోయిన 19 మంది మత్స్య కారులను తీర రక్షణ దళం కాపాడింది. సముద్రంలో చిక్కుకుపోయిన మరికొందరు మత్స్య కారుల కోసం తీరరక్షణ దళం పది ఓడలు, మూడు యుద్ధ విమానాల ద్వారా గాలిస్తోంది.