గుజ‌రాత్‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ఉధృతంగా సాగుతుంది. అనుమ‌తి పొంద‌కుండా రాజ‌కీయ పార్టీలు, అభ్య‌ర్థులు, సంస్థ‌లు, శుక్ర‌వారం, శ‌నివారాల్లో ప్రింట్ మీడియాలో ఎటువంటి ప్ర‌క‌ట‌నలివ్వ‌రాద‌ని ఎన్నిక‌ల సంఘం నిషేధించింది.

గుజ‌రాత్‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ఉధృతంగా సాగుతుంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్, రాష్ర్ట ముఖ్య‌మంత్రి విజ‌య్‌రూపానీ, మాజీ ముఖ్య‌మంత్రి ఆనందీబెన్ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహూల్‌గాంధీ క‌చ్, మోర్బీ, సురేంద‌ర్ న‌గ‌ర్ జిల్లాలో ఇవాళ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ అధ్య‌క్షులు మాయ‌వ‌తి రాజ్‌కోట్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కులు అఖిలేష్‌యాద‌వ్‌, రాజ్‌కోట్‌, జాంన‌గ‌ర్‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొంటారు. క‌చ్‌,సౌరాష్ర్ట , ద‌క్షిణ గుజ‌రాత్‌ల్లో 19 జిల్లాల్లో శ‌నివారం తొలిద‌శ ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. కాగా కులం , మతం ప్రాతిపదికన ప్రజలను విడదీయాలని కాంగ్రెస్ మరోసారి ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఆరోపించారు. గుజరాత్ లోని భావనగర్ లో నిన్న ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. విభజించి పాలించే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ  దేశ వలస పాలకుల నుండి నేర్చుకుందని  ఆయన ఆరోపించారు. శాంతి, సమైక్యత సంక్షేమాల కారణంగా గుజరాత్ వృద్ది చెందిందని, ప్రధాని అన్నారు. నిజానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ కు చెబుతూ ఆయన –  ఎన్నికల ప్రలోభాలకు,  ఆవాస్తవ వాగ్దానాలకు  రాష్ట్రప్రజలు లొంగరని అన్నారు. గుజరాత్ లో వరుసగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు  గిరిజన వర్గాలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. రాష్ట్ర  బిజెపి ప్రభుత్వం గిరిజన ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యథిక ప్రాధానం ఇచ్చిందని నరేంద్రమోదీ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ నిన్న  మొత్తం నాలుగు  బహిరంగసభల్లో ప్ర‌సంగించారు.

మరోవంక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ… యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. ఏడవ వేతన  సంఘం సిఫార్సులను రాష్ట్రంలో అమలు చేయడం  లేదని కూడా ఆయన విమర్శించారు. శాసనసభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీల అగ్రనాయకులు బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం చేస్తున్నారు.