సౌరాష్ర్ట‌,  ద‌క్షిణ గుజ‌రాత్ ప్రాంతాల్లో ఈ రోజు తేలిక‌పాటి నుంచి ఒక మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని, కొన్ని చోట్ల భారీ వ‌ర్షాలు కురువ‌నున్నాయ‌ని భూవిజ్ఞాన‌మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది.

ఓఖీ తుఫాన్ వ‌ల్ల ఉత్త‌ర మ‌హారాష్ర్ట‌, ద‌క్షిణ గుజ‌రాత్ స‌ముద్ర‌తీరం ప్రాంతంలో  స‌ముద్రం అల్లోక‌ల్లోంగా ఉంటుంది. మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో చేప‌ల‌వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని అధికారులు గ‌ట్టిగా హెచ్చ‌రించారు. సౌరాష్ర్ట‌,  ద‌క్షిణ గుజ‌రాత్ ప్రాంతాల్లో ఈ రోజు తేలిక‌పాటి నుంచి ఒక మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. కొన్ని చోట్ల భారీ వ‌ర్షాలు కురువ‌నున్నాయ‌ని భూవిజ్ఞాన‌మంత్రిత్వ శాఖ తెలిపింది. కొంక‌ణ్ ప్రాంతంలో కూడా భారీ వ‌ర్షాలు కురియ‌వ‌చ్చ‌ని తెలియ‌జేశారు. ముంబాయిలో చుట్టుప‌క్క‌ల జిల్లాల్లో పాఠ‌శాల‌ల‌కు, క‌ళాశాల‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది. అండ‌మాన్ నికోబార్ దీవుల్లో రాగల రెండు రోజుల్లో వ‌ర్షాలు కురుస్తాయని అధికారులు తెలియ‌జేశారు. రేప‌టి వ‌ర‌కు నికోబార్ దీవుల ప్రాంతంలో స‌ముద్రం అల్లక‌ల్లోంగా  ఉంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు తీరంలో  మ‌త్స్య‌కారులు గురువారం వ‌ర‌కు చేప‌ల‌వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు.