ఓఖి తుఫాను క్రమేపి వాయుగుండంగా బలహీనపడుతుంది. ఇది ముందు అంచనా వేసినట్లుగా గుజరాత్ తీరాన్ని సూరత్ వద్ద తాకకపోవచ్చు. అయితే ఎటువంటి అవాంఛనీయ పరిస్థితినైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.

ఓఖి తుఫాను క్రమంగా బలహీన పడుతున్నందున మొదట భావించిన్నట్టు అది గుజరాత్ తీరాన్ని సూరత్ వద్ద తాకకపోవచ్చు. తుపాను తీవ్ర వాయుగుండంగా మారడంతో సూరత్ వద్ద తీరాన్ని తాకవచ్చని అహ్మదాబాద్ లోని వాతావరణ కేంద్రం గత రాత్రి తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి ఉపశమనం కలిగిననట్టైయింది. అయితే ఎలాంటి పరిస్థితనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉంది. NDRF, BSF, సైన్యం , నేవీ, తీర గస్తీ దళం తదితర భద్రతా భలగాలను అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు. ఈ ఉదయం మహారాష్ట్రలోని కొన్ని కోట్ల తేలిక పాటి నుంతి ఒక మోస్తరుగా ఉత్తర కొంకణాది భారీవర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లలోంగా ఉన్నందున్న మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.