గుజరాత్ లో నిన్న వాతావరణం సరిగా లేని కారణంగా అక్కడ బహిరంగ సభలు రద్దయిన్నందువల్ల ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తిరిగి ముమ్మరంగా కానుంది.

గుజరాత్ శాసన సభ ఎన్నికలు ప్రచారానికి సంబంధించి పలువురు నాయకులు ఈ రోజు ముమ్మరంగా సభల్లో పాల్గొంటున్నారు. నిన్న వాతావరణంలో ప్రతికూలతవల్ల పలు సభలు, సమావేశాలు రద్దయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ధందుక, దాహోద్ నేత్రాంగ్ లల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఈ రోజు ప్రసంగిస్తారు. సూరత్ లో ఈ రోజు జరగవలసిన ఎన్నికల సభ ఓఖీ తుపాను కారణంగా రేపటికి వాయిదా పడింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ఉమా భారతి, పర్సోత్తం రూపాలా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొంటారు. ఆలగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, నర్మద, డాంగ్, తాపే జిల్లాల్లోని ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. శనివారం జరిగే మొదటి విడత పోలింగ్ కు సంబంధించి ప్రచార గడువు రేపు సాయంత్రంతో ముగుస్తుంది.