దేశమే తమ క్రీడాకారులకు ఉత్రేరకాల వాడకం కార్యక్రమం నిర్వహించిన అరోపణలు ఎదుర్కొంటున్న రష్యాను అంతర్జాతీయ ఒలంపిక్స్  సంఘం వచ్చే సంవత్సరం జరిగే శీతాకాల ఒలంపిక్స్ పాల్గొనకుండా నిషేదం విధించింది.

రష్యా తానే స్వయంగా తమ క్రీడాకారులకు నిషేధ ఉత్ప్రేరకాల కార్యక్రమం నిర్వహించిన్నందుకు ఆదేశాన్ని వచ్చే సంవత్సరం జరిగే ఓలంబిక్స్ శీతాకాల క్రీడలకు అంతర్జాతీయ ఓలంపిక్స సంఘం IOC నిషేధించింది.  అయితే ఇటువంటి ఆరోపణలు, మచ్చలేని రష్యా క్రీడాకారులు మాత్రం ఓలంపిక్ పతాకం కింద ఈ పోటీల్లో పోల్గొనవచ్చు.  ఈ ఆంక్షలను ఇంతకుముందు  ఇంత కఠినంగా IOC ఏ దేశంలోపై విధించవేదు. దక్షిణా కొరియాలోని పిమాంగ్ చాంగ్ లో శీతాకాల ఓలంపిక్స్ జరగడానికి 65 రోజుల ముందు IOC ఈ నిషేధాజ్ఞలు విధించింది. తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ IOC అధ్యక్షుడు థామస్ బ్యాట్- క్రీడా స్ఫూర్తిపై అసాధారణమైన దాడికి రష్యా పాల్పడిందని ఆరోపించారు. 2014 సోచీ శీతాకాల ఓలంపిక్స్ లో రష్యా క్రీడాకారులు ఉత్ర్పేరకాలను సేవించి మోసపూరితంగా క్రీడల్లో పాల్గొన్నారని ప్రపంచ ఉత్ప్రేరకాల నిషేధ సంస్థ నివేధికల్లోనూ, ఆతర్వాత IOC దర్పాప్తుల్లోనూ ధృవపడింది. పథకం ప్రకారం నిర్వహించిన  ఉత్ప్రేరకాల కార్యక్రమంలో ఆదేశంలో క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ సీనియర్ అధికారు, దేశంలోని పలు క్రీడా సంస్థలు పాల్గొన్నాయి.