అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ జెరూస‌లెంను ఇజ్రాయిల్ దేశ‌ రాజ‌ధానిగా గుర్తిస్తుట్లు ప్ర‌క‌టించారు. అమెరికా ఎంబ‌సిని ఆ న‌గ‌రానికి త‌ర‌లించాల‌ని కూడా ఆయ‌న ఆదేశించారు. అయితే ఆ నిర్ణ‌యాన్ని పునః ప‌రిశీలించాల‌ని ప్ర‌పంచ నాయ‌కులు ట్రంప్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. శాంతి ప్ర‌య‌త్నాల‌కు భంగం క‌ల‌గ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించారు.

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ జెరూస‌లెంను ఇజ్రాయిల్ దేశ‌ రాజ‌ధానిగా గుర్తిస్తుట్లు ప్ర‌క‌టించారు. అమెరికా ఎంబ‌సిని టెల్ అవీవ్ నుంచి జెరుస‌లెంకు త‌ర‌లించే ప్ర్ర‌కియ‌ను వెంట‌నే  ప్రారంభించాల‌ని కూడా  ఆయ‌న  ఆదేశించారు. అది ఏనాడో జ‌రుగాల్సిన ప‌న‌ని ట్రంప్ టెలివిజ‌న్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. జెరుస‌లెంలో యూఎస్ ఎంబ‌సీ నిర్మాణం వెంట‌నే ప్రారంభించాల‌ని ఆయ‌న త‌మ దేశ‌ విదేశాంగ శాఖ‌ను ఆదేశించారు. అదే స‌మ‌యంలో ట్రంప్ ఇజ్రాయిల్‌, పాల‌స్తీనా స‌మ‌స్య‌కు ఉభ‌య‌రాజ్య ప‌రిష్కారాన్ని పున‌రుద్ఘాటించారు. ఉభ‌య ప‌క్షాల‌కు ఆమోద‌యోగ్య‌మైన శాంతి ఒప్పందానికి స‌హాయం చెయ్య‌డానికి అమెరికా క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. అయితే  ఆ నిర్ణ‌యాన్ని పున ప‌రిశీలించాల‌ని ప్ర‌పంచ నాయ‌కులు ట్రంప్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. శాంతి ప్ర‌య‌త్నాల‌కు భంగం క‌ల‌గ‌వ‌చ్చ‌ని  హెచ్చ‌రించారు.