ఆర్ధిక సంస్థ‌ల‌, ఖాతాదార్ల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డివుంద‌ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

ఆర్ధిక సంస్థ‌ల‌, ఖాతాదార్ల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డివుంద‌ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. దృఢమైన భారత దేశ‌ నిర్మాణానికి, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ – వ్యాపారవేత్తలను కోరారు. అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఉద్యోగావకాశాల కల్పనకు ప్రభుత్వం విదేశీ పెట్టుబడులతో పాటు.. ప్రైవేటు పెట్టుబడులు కీలకమన్నారు. భారత వాణిజ్యం, పరిశ్రమల ప్రతినిధులతో ఆయన నిన్న ఢిల్లీలో జరిగిన ప్రి-బడ్జెట్ సంప్రదింపు సమావేశంలో పాల్గొన్నారు. ఆ దిశలో ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టిందని, జాతీయ పెట్టుబడి, మౌలిక నిర్మాణ నిధిని నెలకొల్పిందని అన్నారు.