గుజరాత్‌లో 89 స్థానాల్లో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ఈ సాయంత్రం ముగుస్తుంది.

గుజరాత్‌లో 89 స్థానాల్లో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ఈ సాయంత్రం ముగుస్తుంది. ఈ రోజు జ‌రుగుతున్న బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ పాల్గొంటున్నారు. ఇలావుండ‌గా నిన్న శాస‌న‌స‌భ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారం తారాస్థాయిలో సాగింది. ఈ నెల 9వ తేదీన పోలింగ్ నిర్వ‌హిస్తున్న 89 శాస‌న‌స‌భ స్థానాల్లో ఈ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. భారత స్వాతంత్ర్య సమరంలో గిరిజనుల పాత్రను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న గుజ‌రాత్లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ల్లో విమ‌ర్శించారు.  కాగా – గుజ‌రాత్‌ రాష్ట్రంలో ఇప్ప‌టికీ  39 శాతం పిల్లలు పౌష్ఠికాహార లోపంతో బాధ‌ప‌డుతున్నార‌ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ నిన్న జరిగిన ప్ర‌చార స‌భ‌ల్లో  విమర్శించారు.