భువ‌నేశ్వ‌ర్‌లో జరుగుతున్న హాకీ ప్ర‌పంచ లీగ్ పోటీల్లో ఒలింపిక్ వెండి విజేత బెల్జియంను ఓడించి భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేరుకుంది.

భువ‌నేశ్వ‌ర్‌లో జరుగుతున్న హాకీ ప్ర‌పంచ లీగ్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఇండియా ఒలింపిక్ వెండి విజేత బెల్జియంను 3-2తో ఓడించి సెమీ ఫైన‌ల్లో ప్ర‌వేశించింది. గుర్జంత్‌సింగ్‌, హ‌ర్‌మ‌న్‌ప్రీత్ సింగ్‌, రూపింద‌ర్ పాల్ సింగ్ త‌లోగోల్ చేశారు. మ‌రో క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఆస్ర్టేలియా స్పెయిన్‌ను 4-1తో ఓడించింది. ఇంగ్లాండ్, ఆర్జెంటినా, జర్మ‌నీ- నెద‌ర్లాండ్స్ మ‌ధ్య జ‌రిగే మ‌రో రెండు క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ త‌ర్వాత సెమీ ఫైన‌ల్లో ఇండియా ఎవ‌రితో ఆడేది తెలుస్తుంది.