ఉత్తమ ప్రతిభాపాఠవాలు గలవారిని మాత్రమే తమ దేశంలోకి రానిస్తామని అమెరికా పేర్కొంది.

ఉత్తమ ప్రతిభాపాఠవాలు గలవారిని మాత్రమే తమ దేశంలోకి  రానిస్తామని అమెరికా పేర్కొంది.  అమెరికాకు అక్రమ వలసలు ఆపడానికి చాలా కాలంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఆదేశ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అమెరికా వీసాల జారీకి ప్రతిభ ఆధారిత విధానాన్ని ప్రతిపాదించారు. ఇప్పటికే అమెరికాలో పౌరుడైన వ్యక్తి స్పాన్సర్  చేస్తూ వారి కుటుంబ సభ్యులను బంధువులను అమెరికాకు తీసుకువచ్చే గొలుసు వలస విధానాన్ని ఇకపై ఆపివేస్తామని కూడా డోనాల్డ్ ట్రంప్ తెలియజేశారు.