ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నెల 20వ తేదీ నుంచి ఉచిత సేవలన్నీ రద్దు చేస్తాయన్న మీడియా కథనాలను ప్రభుత్వం ఖండించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈనెల 20వ తేదీ నుంచి ఉచిత సేవలన్నీ రద్దు మీడియా కథనాలను ప్రభుత్వం ఖండించింది. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆమీడియా కథనాలు నిరాధారమని వట్టి పుకార్లని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ట్విట్టర్ లో స్పష్టం చేశారు. భారత బ్యాంకుల సంఘం కూడా ఒక వివరణ ఈ సందర్భంగా విడుదల చేసింది. ఉచిత సేవలు రద్దు చేసే ప్రతిపాదన బ్యాంకులకు ఏదీ లేదని పేర్కొంది. అలాంటి ప్రచారంతో ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పింది.