2018లో భారత వృద్ధిరేటు 2.7 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

2018లో భారత వృద్ధిరేటు 2.7 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆతర్వాత రెండు సంవత్సరాల్లో 7.5 శాతానికి పెరుగుతుందని కూడా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2018 ప్రపంచ ఆర్థిక ప్రగతిపైన ప్రపంచ బ్యాంక్-1 వాషింగ్టన్ లో ఒక నివేధిక విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇండియాకు అపారమైన అభివృద్ధి అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడిచింది. ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సంస్కరణలు అందుకు ఎంతో దోహదం చేస్తున్నాయని కూడా ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది.