గ్రేట్ నోయిడాను ఈరోజు జాతీయ యువజనోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు.

గ్రేట్ నోయిడాను ఈరోజు జాతీయ యువజనోత్సవాన్ని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. 5 రోజులపాటు జరిగే ఈ ఉత్సవం మొదటిరోజున దేశ వ్యాప్తంగా ఉన్న యువతను ఒక వేదికపైకి తీసుకువస్తారు. వివిధ రంగాలలో వారి నైపుణ్యాల ప్రదర్శనకు  అవకాశమిస్తారు. సంకల్ప్ సే సిద్ధి అనే ఇతివృత్తంతో ఈ  ఉత్సవం జరుగుతుంది. దేశ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువజనులను ఏకం చేసిన నూతన భారతావణి లక్ష్యసాధనను పూర్తి చేయడం ఈ ఉత్సవం లక్ష్యంగా పెట్టుకుంది. స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా ఈ యువజనోత్సవం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ కు, నెహ్రు యువ కేంద్రకు చెందిన దేశ వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది యుజత ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ప్రారంభ కార్యక్రమంలో జాతీయ యువ పురస్కారం ప్రదానం చేస్తారు. ప్రారంభ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, కేంద్ర యుజవన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కల్నల్ రాజవర్ధన్ రాథోడ్ సహాధ్యక్షత వహిస్తారు.