భారత నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ దిశలో మాల్దీవులతో తమ సంబంధాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది.

భారత నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ విధానం ద్వారా మాల్దీవులతో గల తమ సంబంధాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పింది. మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్, మహమద్ అసీమ్ న్యూఢిల్లీలో నిన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలుసుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను దృడతరంగా చేసుకునే అంశంపై ఇరువురు నాయకుల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. మాల్దీవుల ఇండియన్ ఫస్ట్ అనే విధానాన్ని భారత్ అనుసరిస్తున్న పొరుగుదేశాలు మొదటి అనే నేబర్ హుడ్ ఫస్ట్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చర్చలు జరిగాయన్నారు. మాల్దీవుల అధ్యక్షుని ప్రత్యేక రాయబారి కూడా అయిన డాక్టర్ అసిమ్ భారత్ లో 3 రోజుల పర్యటనకై న్యూఢిల్లీ చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇండియా ఫస్ట్ అనే విధానం ద్వారా భారత్ లో మరింత సన్నిహత సంబంధాలు కొనసాగిస్తామని ఆసిం చెప్పారు.