అంతరిక్షంలో భారత్ శతకం

శుక్రవారం భారత్ అత్యద్భుత విజయం సాధించింది. అంతరిక్ష్యంలో శతకం సాధించింది. భారత్ నూరవ కార్టోసాట్-2ఎఫ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని పిఎస్ ఎల్‌వి రాకెట్ సహాయంతో అంతరిక్ష్యంలోకి ఇస్రో ప్రయోగించింది. కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన ఈ ఉపగ్రహం భారత అంతరిక్ష శాస్త్రవేత్తలకు ఎంతో నైతిక స్థైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఎర్త్ అబ్సర్వేషన్ శాటిలైట్ కార్టోసాట్-2 నిజంగా భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం. ఇది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్‌వి) రాకెట్  విశ్వసనీయతను తిరిగి చాటింది. భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) సృష్టించిన శక్తివంతమైన లాంచ్ వెహికల్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరపరుచుకుంది. పిఎస్ఎల్‌వి వరుసగా 39 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.

ఒక అంచనా ప్రకారం మొదట్లో పిఎస్ఎల్‌వి –సి39 విజయవంతం కావడంపై అనుమానాలు తలెత్తాయి. ఎందుకంటే దాని హీట్ షీల్డ్ సెపరేషన్ సాధ్యం కాలేదు. దీంతో పిఎస్ఎల్‌వి-సి 39 నాల్గవ దశలో హీట్ షీల్డ్‌తోపాటు ఉపగ్రహానికి అంతరిక్షంలో ఇబ్బంది ఏర్పడింది. మొత్తానికి మూడు దశలు దాటి నాల్గవ దశలో భూమి నుంచి విడివడే సెపరేషన్ క్రమం కూడా సాఫీగా జరిగిపోయింది.

శుక్రవారం అంతరిక్ష్యంలో భారత్ సాధించిన విజయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది ఆగస్టులో ఇస్రో చేపట్టిన ప్రయోగం వైఫల్యం చెందిన తర్వాత చేసిన ఈ ప్రయోగం ఇస్రోను మళ్లా దృఢంగా నిలబెట్టింది. అంతేకాదు పిఎస్ఎల్‌వి ప్రయోగించిన కార్టోసాట్-2 ఎఫ్ బరువు 710 కిలోలు. ఇప్పటివరకూ పిఎస్ఎల్‌వి ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇది అత్యంత బరువైనది కూడా.

కార్టోసాట్ సిరీస్‌లో ప్రస్తుతం ప్రయోగించిన కార్టోసాట్-2ఎఫ్ ఏడవది. భూమి నుంచి నియంత్రించే ఉపగ్రహమైన దీన్ని సూర్యానువర్తిత దృవ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. హై రిజల్యూషన్‌తో కూడా భారీ-స్కేల్ మ్యాపులను రూపొందించడం ఈ ఉప గ్రహం చేసే ప్రధానమైన పని. ఈ ఉపగ్రహం నుంచి వచ్చే చిత్రాలను కార్టోగ్రఫిక్ అప్లికేషన్లతోపాటు, పట్టణ, గ్రామీణ అప్లికేషన్ల కోసం వినియోగించుకుంటారు. సముద్ర తీర భూభాగ వినియోగం, హేతుబద్ధీకరణ కోసం కూడా వినియోగిస్తారు. అంతేకాక వీటిని రోడ్ నెట్‌వర్క్ మానిటరింగ్, నీటి సరఫరా, భూవినియోగ మ్యాపుల తయారీ, భౌగోళిక మార్పులకు సంబంధించిన సమాచార సేకరణ, మానవ నిర్మిత అంశాలైన ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎల్ఐఎస్), జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) అప్లికేషన్ల కోసం కూడా ఈ ఉపగ్రహం పంపే చిత్రాలు ఉపయోగపడతాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమంటే ఒక మీటరు కన్నా తక్కువ పరిధిలో ఉండే హై రిజల్యూషన్ చిత్రాల వల్ల సరిహద్దుల్లో నిఘా కోసం ఈ ఉపగ్రహం అద్భుతంగా ఉపయోగపడుతుంది.

కార్టోసాట్-2ఎఫ్‌తోపాటు ఈ మిషన్‌లో భాగంగా మరో 30 చిన్న తరహా ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపించారు. అందులో భారత దేశానికి చెందిన ఒక మైక్రో శాటిలైట్, మరో నానో శాటిలైట్‌లు ఉండగా ఆరు దేశాలు-కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్, అమెరికాలకు చెందిన మూడు మైక్రో శాటిలైట్లు, మరో 25 శాటిలైట్లను వాహక నౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఈ ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కార్టోసాట్‌ను సూర్యానువర్తిత ధవ కక్ష్యలోకి 510 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టగా, 30 మైక్రో, నానో శాటిలైట్లను 349 కిలోమీటర్ల ఎత్తులో విడుదల చేశారు. ఇలా రెండు వివిధ కక్ష్యల్లోకి ఉపగ్రహాలు ప్రవేశపెట్టడంతో ఈ మిషన్ ప్రత్యేకంగా నిలిచింది. రెండు కక్ష్యల్లోకి ఉప గ్రహాలను ప్రవేశపెట్టాలంటే రాకెట్‌లోని నాలుగవ స్థాయి ఇంజన్‌ను పలుమార్లు నిలుపుదల చేసి, తిరిగి ప్రారంభించాల్సి వస్తుంది. అయితే మిషన్ చివరి దశ-ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం-వరకు పూర్తి చేయడానికి 2 గంటలా 21 నిముషాల సమయం పట్టింది.

పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా చేపడుతున్న విజయవంతమైన అంతరిక్ష ప్రయోగాల ట్రాక్ రికార్డు కారణంగా, ఇస్రోకు గత ఏడేళ్లుగా వివిధ అంతర్జాతీయ కస్టమర్ల నుంచి సేవలు పొందడానికి డిమాండ్లు వస్తున్నాయి. తమ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా అంతరిక్షంలోకి పంపాలనే ఇస్రోను సంప్రదిస్తున్నారు. ఇప్పటి వరకు ఇస్రో 20 దేశాలకు చెందిన వివిధ ఉపగ్రహాలను 15 ప్రయోగాల్లో పీఎస్‌ఎల్‌వీ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అంతరిక్ష వాహక రంగంలో భారత దేశ శక్తిసామర్థ్యాలు అనూహ్యంగా ఇనుమడించడంతోపాటు అంతర్జాతీయంగా వివిధ కస్టమర్లలో విశ్వాసాన్ని కూడా నింపుతోంది. దీంతో మైక్రో, నానో శాటిలైట్లను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగే సామర్థ్యాన్ని భారత్ సాధించింది. అంతరిక్ష ప్రయోగాలు చేసే ఇతర దేశాలు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు కూడా తమ నానో శాటిలైట్ల ప్రయోగం కోసం పదే పదే భారత దేశాన్ని సంప్రదించడం గమనార్హం.

2018లోని తొలి మిషన్‌తో శుభారంభం చేసిన ఇస్రో ఎదుట ఈ ఏడాది చేపట్టాల్సిన పలు వినూత్నమైన మిషన్‌లు ముందున్నాయి. అందులో చంద్రయాన్-2 ముఖ్యమైనది. చంద్రునిపై ప్రయోగిస్తున్న రెండో మిషన్ ఇది కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో దీన్ని చేపడతారని భావిస్తున్నారు. ఈ మిషన్ కోసం ఇస్రోలోకి అత్యంత భారీ ఉపగ్రహ వాహక నౌక జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్‌ఎల్‌వీ)-మార్క్ 3ని వినియోగిస్తారు. అయితే చంద్రయాన్-2 గతంలోలా కక్ష్య సంబంధమైన మిషన్ కాదు. అది చంద్రునిపై రోవర్‌ని ప్రవేశపెట్టి దాని ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది.

రచన : బిమన్ బసు, సీనియర్ సైన్స్ వ్యాఖ్యాత