ఇజ్రాయిల్ ప్ర‌ధాన‌మంత్రి బెంజ‌మ‌న్ నెత‌న్యాహూ ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు భార‌త‌దేశ‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

ఇజ్రాయిల్ ప్ర‌ధాన‌మంత్రి బెంజ‌మ‌న్ నెత‌న్యాహు ఆదివారం నుంచి ఆరు రోజుల‌పాటు  భార‌త్‌లో ప‌ర్య‌టిస్తారు. నేత‌న్యాహుతో పాటు ఆ దేశ వాణిజ్య , పారిశ్రామిక ప్ర‌తినిధి బృందం కూడా ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటోంది. ఇజ్రాయిల్ ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీతో స‌మావేశం అవుతారు. ఇంక ఆయ‌న ఆగ్రా, అహ్మ‌దాబాద్‌, ముంబైలో ప‌ర్య‌టిస్తార‌ని విదేశాంగ శాఖ అధికారులు తెలియ‌జేశారు. భార‌త్, ఇజ్రాయిల్ దేశాల మ‌ధ్య వ్య‌వ‌య‌సాయం, నీరు ప్ర‌ధాన వ్యూహాత్మ‌క స‌హ‌కార రంగాలుగా ఉన్నాయి. ఇరు దేశాలు ఆయా రంగాల్లో స‌హ‌కారం మ‌రింత పెంచుకునే అవ‌కాశం ఉంది. భార‌త్‌, ఇజ్రాయిల్ దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 5 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లుగా ప్ర‌స్తుతం ఉంది. ఇజ్రాయిల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని విదేశీ వాణిజ్యరంగ శాఖ అధికారులు వివ‌రించారు.