జాతీయ మ‌హిళా బాక్సింగ్ ఛాంపియ‌న్ షిప్‌లో ప్ర‌పంచ వెండి విజేత స‌ర్జుబాలా దేవీ బంగారు ప‌త‌కం గెలుపొందారు.

రోత‌క్‌లో జ‌రిగిన జాతీయ మ‌హిళా బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో ప్ర‌పంచ వెండి విజేత స‌ర్జుబాలా దేవీ 48 కిలోల విభాగంలో మ‌ణిపూర్‌కు బంగారం ప‌త‌కం గెలుపొందారు. ఆమెకు ఉత్త‌మ బాక్స‌ర్ ట్రోఫి కూడా ప్ర‌ధానం చేశారు. స‌ర్జుబాలా దేవీ హ‌ర్యాణాకు చెందిన రీతూను 3-2తో ఓడించారు. మ‌ణిపూర్‌కు ఏకైక బంగారు ప‌త‌కాన్ని గెల‌వ‌డంతోపాటు త‌న‌కు రెండ‌వ జాతీయ టైటిల్‌ను కూడా ఆమె గెలుచుకున్నారు. కాగా అఖిల భార‌త పోలీస్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన ప్ర‌పంచ విజేత ఆసియ‌న్ విజేత ఎల్‌. స‌రితా దేవీ 60 కిలోల విభాగంలో బంగారు ప‌త‌కం గెలుచుకున్నారు. 57 కిలో విభాగంలో ఆర్ ఎస్ పీబీ నుంచి సోనియ లాత‌ర్ 54 కిలోల్లో ఏఐపీ నుంచి మీనా కుమారి, 48 కిలోల్లో ఆర్ఎస్‌పీబీ నుంచి రాజేష్ న‌ర్వాల్ బంగారు ప‌త‌కాలు గెలుచుకున్నారు.