డిసెంబ‌ర్‌లో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌నం 5.21 శాతానికి పెరిగింది.

డిసెంబ‌ర్ మాసంలో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌నం 5.21 శాతానికి పెరిగింది. ఆహార స‌రుకులు, గుడ్లు, కూర‌గాయాలు ధ‌ర‌లు పెర‌గ‌డంతో ద్ర‌వ్యోల్బ‌నం పెరిగింది. న‌వంబ‌రులో వినియోగ‌దారుల ధ‌ర‌ల సూచీ ఆధారంగా చిల్ల‌ర ద్ర‌వ్వోల్బ‌నం 4.88 శాతం నుంచి 2015 డిసెంబ‌ర్‌లో అది 3.41 శాతంగా న‌మోదై ఉంది. ద్ర‌వ్బోల్బ‌నం 2 శాతం అటూఇటూగా 4 శాతం ఉండేలా చూడాలని ప్ర‌భుత్వం ఇంత‌కు ముందు రిజ‌ర్వు బ్యాంకుకు చెప్పింది. అంత‌కు ముంద‌టి నెల‌లో 4.42 శాతం ఉన్నటివంటి ఆహార ద్ర‌వ్యోల్బ‌నం డిసెంబ‌ర్ మాసంలో 4.96 శాతానికి పెరిగింద‌ని కేంద్ర గ‌ణాంకాల కార్యాల‌యం సీఎస్ఓ నిన్న విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది.