దేశంలో శిశు మ‌ర‌ణాలు బాగా త‌గ్గాయి.

దేశంలో శిశుమ‌ర‌ణాలు బాగా త‌గ్గాయి. ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల్లో మ‌ర‌ణాలు 2015లో ప్ర‌తి వెయ్యి మందికి 43గా ఉండ‌గా 2016లో అవి 39కి త‌గ్దాయ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది. చాలా రాష్ట్రాలు శిశు మ‌ర‌ణాలు త‌గ్గించ‌డానికి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని, అవి ఉత్త‌మ‌మైన ఫ‌లితాలు ఇచ్చాయ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇంకా చ‌త్తీస్‌గ‌ఢ్‌, ఢిల్లీ, ఉత్త‌రాఖండ్‌లో ప‌రిస్థితి మ‌రింత మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా పేర్కొన్నారు. శిశు మ‌ర‌ణాల నివార‌ణకు ప్ర‌భుత్వ చ‌ర్య‌లు మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.