సింగిల్ బ్రాండ్ రిటైల్, విమానయాన రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై భారత్ భారీస్థాయి సంస్కరణలు

దేశ ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలని మరింత పెంపొందించేందుకుగాను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని భారీ స్థాయిలో ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం విమానయాన రంగం, రిటైల్ రంగాల్లో ఎఫ్‌డిఐ నిబంధనలను బాగా సరళీకృతం చేసింది.  మరీ ముఖ్యంగా ‘సింగిల్ బ్రాండ్’ రిటైల్ ట్రేడింగ్, పౌర విమానయానరంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం బాగా వీలుకల్పించింది. దేశ పౌర విమానయానరంగంలో ఎఫ్‌డిఐ ప్రకటన  వెనుక ఆ రంగాన్ని విస్తృతపరిచే పెద్ద లక్ష్యం దాగుంది.

దీంతో 2016-17 వార్షిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 60 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందింది. అందుకే ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత సరళీకృతం చేయాలని భావించింది. తద్వారా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినిస్’కు అవకాశం కల్పిస్తూ దేశంలో ఆర్థిక ప్రగతిని పరిపుష్ఠం చేయాలని భావించింది.

రిటైల్ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అంటే ‘ఆటోమేటిక్ రూట్’ కింద 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది. దీంతో రిటైల్ (సింగిల్ బ్రాండ్) రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రొసీజర్ వేగవంతమవుతుంది.  తొలి ఐదు సంవత్సరాల కాలంలో తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు  ఉపయోగకరమైన వస్తువుల కోసం రిటైల్ ఫామ్స్ కు అనుతినిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక ముఖ్యమైన పరిణామంగా పేర్కొనాలి.  ఈ పాలసీ భారత్‌లో 30 శాతం నిబంధనకు వ్యతిరేకమైంది. ఫలితంగా సింగిల్ బ్రాండ్‌ రిటైల్ ట్రేడింగ్ లో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం వల్ల భారతదేశంలోని రిటైల్ ట్రేడ్‌లోకి బహుళకంపెనీల రంగప్రవేశానికి మార్గం సుగమమవుతుంది.

దేశ పౌర విమానయానరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతినివ్వడం విదేశీ ఎయిర్‌లైన్స్‌ కు ద్వారాలు తెరుస్తోంది. అప్రూవల్ రూట్‌లో 49 శాతం మేర ఎయిర్ ఇండియాలో పెట్టుబడులకు అనుమతిస్తోంది. అంటే ఎయిర్ ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతం 49కి దాటరాదు. అంతేకాదు  ఎయిర్ ఇండియా యాజమాన్యం అత్యధికశాతం భారత్ చేతిలోనే ఉండాలి. ఎయిర్ ఇండియాలో విదేశీ ఎయిర్‌లైన్స్ పెట్టుబడులు అనేది దేశీయ విమానయానరంగంలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల పరంగా వేసిన ప్రముఖ ముందడుగుగా పేర్కొనాలి.

ప్రపంచవ్యాప్తంగా 260 ఎయిర్‌లైన్స్‌లు ప్రతినిధులు, ప్రపంచ ఎయిర్ ట్రాఫిక్‌లో 83 శాతం వాటా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఎటీఎ) భారత దేశంలో దేశీయ విమాన రద్దీ రెండంకెల స్థాయికి (సుమారుగా 20 శాతం) పెరిగిందని కితాబునిచ్చింది. ఇది భారత దేశంలోకి కొత్త ఎయిర్‌లైన్స్‌ల రంగ ప్రవేశంతో సర్వీసుల సంఖ్య పెరగడంతో సాధ్యమైందని తెలిపింది.

విమానయాన మంత్రి భారీ స్థాయిలో ప్రాంతీయ అనుసంధాన విధానాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా అనుసంధానత లేని దేశంలోని వివిధ పట్టణాలను దేశీయ విమాన సర్వీసులపై సెస్ వసూలు చేయడం ద్వారా అనుసంధానిస్తారు. అయితే విమానయాన రంగంలో ఎఫ్‌డీఐలు అంటే దాని అర్థం కేవలం ‘‘ఎయిర్‌లైన్స్’’కు మాత్రమే పరిమితం కాదు. విమానయాన మౌలిక వసతులు, ఏవియానిక్స్‌ను బలోపేతం చేయడంలో కూడా ఎఫ్‌డీఐలు ఉంటాయని కూడా అర్థం చేసుకోవాలి.

విమానయాన రంగంలో ఎఫ్‌డీఐలను బలోపేతం చేస్తున్న వైనం ప్రస్తుతానికి ఎయిర్‌లైన్స్‌కు మాత్రం పరిమితమైంది. అది మరింత లోతుగా ఏవియానిక్స్, విమానయాన మౌలిక సదుపాయాల వరకు విస్తరించాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం చేపట్టిన గ్రీన్-ఫీల్ట్ విమానాశ్రయాలు, (హైదరాబాద్, బెంగుళూరు తరహాలో), బ్రౌన్-ఫీల్డ్ విమానాశ్రయాల (ఢిల్లీ, ముంబై తరహాలో) అభివృద్ధి దీనికి ఎంతో కీలకమైనది. ప్రభుత్వం తన ఎఫ్‌డీఐ పాలసీలో భాగంగా గ్రీన్-ఫీల్డ్ ప్రాజెక్టుల్లోని ఆటోమాటిక్ రూట్లలో 100 శాతం ఎఫ్‌డీఐనీ, బ్రౌన్-ఫీల్డ్ ప్రాజెక్టుల్లో 74 శాతం ఎఫ్‌డీఐని అనుమతించింది. బ్రౌన్-ఫీల్డ్ ప్రాజెక్టుల్లో 74 శాతానికి మించిన ఎఫ్‌డీఐని ప్రభుత్వ మార్గంలో విమానయాన మౌలిక సదుపాయాల ఆధునీకికరణకు అనుమతిస్తారు.

అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా విషయంలో అంతర్జాతీయ విమానయాన సంస్థల నుంచి బిల్లు ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకర్శించిన ఏకైక ప్రతిపాదన కావడం గమనార్హం.  ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. స్థానిక ఎయిర్‌లైన్స్‌లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించిన భారత్ ఎయిర్ ఇండియా విషయానికి వచ్చే సరికి ఎఫ్‌డీఐని 49 శాతానికి పరిమితం చేసింది.

ఎఫ్‌డీఐ విషయంలో ప్రస్తుతం చేపట్టిన సంస్కరణలు చాలా స్పష్టంగా మోదీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల విషయం అనుసరిస్తున్న వైఖరి అర్థమవుతోంది. ‘‘ఎగిరిపోయే’’ ఎఫ్ఐఐ కన్నా స్థిరంగా ఉండే ఎఫ్‌డీఐ మేలు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఎఫ్ఐఐ నుంచి ఎఫ్‌డీఐ వైపునకు మారుతున్న ధోరణి వల్ల దేశంలోని ఆర్థిక స్థితిగతుల్లో వృద్ధి కనిపించడంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి. అందుకే ఈ ధోరణి ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణ యోగ్యంగా ఉంది. ఎఫ్ఐఐ సాధారణంగా మారుతున్న వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటే, ఎఫ్‌డీఐ మాత్రం స్థిరమైన పెట్టుబడితో ముడిపడి ఉంటుంది. ఫిబ్రవరిలోని బడ్జెట్ అనంతరం రానున్న మాసాల్లో మరికొన్ని వరుస సంస్కరణలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

రచన: డా. లేఖా ఎస్ చక్రవర్తి, అసోసియేట్ ప్రొఫెసర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ

&

రీసెర్చ్ అసోసియేట్, ది లెవీ ఎకనామిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బార్డ్ కాలేజ్, న్యూయార్క్