కేంద్ర హమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్ము కశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. న్యూ ఢిల్లోలీ ఆయన ఉన్నతాధఇకారులతో సమావేశం జరిపారు.

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్ము కశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. న్యూఢిల్లీలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం జరిపారు. రాష్ట్రంలో పరిస్థితిని గురించి, ముఖ్యంగా జమ్మూలో సవివరంగా తెలియజేశారు. రాష్ట్రం మొత్తంలో అత్యున్నత స్థాయిలో భద్రతా ఏర్పాటు చేశామనీ, శాంతికి విఘాతం కల్పించేందుకు ఉగ్రవాదులు చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని కేంద్ర హోం మంత్రికి తెలియజేశారు. సరిహద్దు నుంచి చొరబాటు ప్రయత్నాలను నివారించాలని రాజ్ నాథ్ సింగ్ ఆదేశించినట్లు వర్గాలు తెలియజేశాయి. కేంద్ర హోమ్ కార్యదర్శి, రాజీవ్ గూబ, ఇంటలిజెన్స్ బ్యూరో రాజివ్ జైన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.