యుద్ధంతో చిన్నాభిన్నమై దక్షిణ సుడాన్ లో యుఎన్ శాంతి పరిరక్షక దళంలో చేరేందుకు దాదాపు 2 వేల 300 మంది సైనిక సిబ్బంది బయల్దేరి వెళ్లారు.

యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఆఫ్రికా లోని దక్షిణ సూడాన్ లో ఐక్యరాజ్యసమితి చర్యల్లో పాలు పంచుకునేందుకు 2 వేల 300 మంది సైనికులు వెళ్లుతున్నారన్న భారత సైనిక ప్రతినిధి కల్నల్ అమర్ ఆనంద్ ఢిల్లీలో మాట్లాడుతూ దక్షిణ సూడాన్ లో శాంతి యుత పరిస్థితులు వెలవేసేందుకు ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా భారత సైన్యం నిలుస్తోందని, ఇందుకోసం భర్త సైనికులు దాదాపు 2 వేల 300 మంది అక్కడకు వెళ్లుతున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్ లో పాల్గొనేందుకు గార్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ కు చెందిన సైనిక బెటాలియన్ నుంచి సైనికుల వెళుతున్నట్లు ఆనంద్ పేర్కొన్నారు. గత ఆరు దశాబ్దాలలో ఐక్యరాజ్యసమితి చేపటిటన 71 శాంతి పరిరక్షణ మిషన్లలో 50 మిషన్లు దాదాపు 2 లక్షల భారత సైనిక దళాలు పాల్గొని్నాయని, ప్రస్తుత  16 మిషన్లలో 13 భారత దళాలు ఉన్నాయని సైనికాధికారి తెలిపారు.