ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ఈ రోజు చ‌ట్ట స‌భ‌ల స‌భ్యుల రెండు రోజుల జాతీయ మ‌హాస‌భ‌లు ప్రారంభిస్తారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఈ రోజు పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో చ‌ట్ట స‌భ‌ల స‌భ్యుల రెండు రోజుల జాతీయ మ‌హాస‌భ‌లు ప్రారంభిస్తారు. పార్ల‌మెంట్ స‌భ్యుల, శాస‌న స‌భ్యులు, శాస‌న మండ‌లి స‌భ్యులు ఈ జాతీయ స‌ద‌స్సు స‌మావేశాల్లో పాల్గొంటారు. పార్ల‌మెంట్‌లో శాస‌న స‌భ‌ల్లో, శాస‌న మండ‌లిలో స‌భ్యులుగా ఉన్న‌వారు త‌మ అనుభ‌వాల్ని పంచుకోవ‌డానికి ఇది ఒక జాతీయ వేదిక‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో చ‌ట్ట స‌భ‌ల స‌భ్యుల పాత్ర‌పై ప్ర‌ధాన‌మంత్రి చ‌ర్చిస్తారు.  నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి, అందుకు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చిస్తారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న‌వారంతా ఈ స‌ద‌స్సుల్లో చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు. రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు, శాస‌న‌స‌భ‌ల స్పీక‌ర్లు, పార్ల‌మెంట్ స‌భ్యులు, శాస‌న‌స‌భ్యులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌వుతారు.