అంత‌ర్జాతీయ సౌర ఇంధ‌న కూట‌మి స‌ద‌స్సు ఈవేళ ఢిల్లీలో జ‌రుగుతుంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్యానుయ‌ల్ మాక్రాన్‌లు అధ్య‌క్ష‌త వ‌హిస్తారు.

అంత‌ర్జాతీయ సౌర ఇంధ‌న కూట‌మి స‌ద‌స్సు ఈ వేళ ఢిల్లీలో జ‌రుగుతుంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్యాన్యుయెల్ మాక్రాన్‌లు ఈ స‌ద‌స్సుకు అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లోని సాంస్కృతిక కేంద్రంలో జ‌రిగే ఈ స‌ద‌స్సుకు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌తినిధులు వివిధ బ్యాంకుల అధ్య‌క్షులు, ఆర్థిక సంస్థ‌లు, ఇంధ‌న సంబంధిత సంస్థ‌ల ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతారు.  నిన్న ఢిల్లీ చేరుకున్న ప్ర‌తినిధుల‌కు రాష్ట్ర‌ప‌తి రాంనాథ్‌కోవింద్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స్వాగ‌తం ప‌లికారు.