ఉ్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రెండు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు, బీహార్‌లో ఒక స్థానానికి ఈ వేళ ఉప ఎన్నిక పోలింగ్ జ‌రుగుతుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రెండు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు, బీహార్‌లోని ఒక స్థానికి ఈవేళ ఉప ఎన్నిక పోలింగ్ జ‌రుగుతుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పుల్పూర్‌, గోర‌ఖ్‌పూర్ స్థానాల‌కు, బీహార్‌లోని అరైరియా లోక్‌స‌భ స్థానాల‌తోపాటు బీహార్‌లోని జెహ‌నాబాద్‌, బాహువా శాస‌న‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక పోలింగ్ జ‌రుగుతోంది. ఈ ఉద‌యం 7 గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌ల‌ను వాడుతున్నారు. అల‌హాబాద్ జిల్లా పూల్పూరు స్థానానికి బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్ధులు స‌హా 22 మంది, గోర‌ఖ్‌పూర్‌లో 10 మంది పోటీలో ఉన్నారు. గోర‌ఖ్‌పూర్ స్థానానికి ప్రాతినిధ్యం వ‌హించిన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, పుల్పూరులో ఉప‌ముఖ్య‌మంత్రి కేశ‌వ్ ప్ర‌సాద్ రాజీనామాల కార‌ణంగా ఈ ఉప ఎన్నిక‌లు అవ‌స‌ర‌మ్యాయి. వారిద్ద‌రు ఈ రాష్ట్ర శాస‌న మండ‌లికి వెళ్లారు.