రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ మారిష‌స్, మ‌డ‌గ‌స్క‌ర్ దేశాల్లో అయిదు రోజుల ప‌ర్య‌ట‌న‌కు ఈ ఉద‌యం బ‌య‌లుదేరి వెలుతారు.

రాష్ట్ర‌ప‌తి రాంనాథ్‌కోవింద్ మారిష‌స్‌, మ‌డ‌గ‌స్క‌ర్ దేశాల్లో అయిదు రోజుల ప‌ర్య‌ట‌న‌కోసం ఈ ఉద‌యం బ‌య‌లుదేరి వెళ్తున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో మొద‌ట‌గా మారిష‌స్ రాజ‌ధాని పోర్టులూయిస్‌లో 50వ స్వాతంత్ర దినోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. ఆదేశ అధ్య‌క్షుడు అమిన్ గురిబ్‌, ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌వింద్ జ‌గ‌న్నాథ్‌తో రాష్ట్ర‌ప‌తి చ‌ర్చ‌లు జ‌రుపుతారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తోపాటు ఇత‌ర రాజ‌కీయ నాయ‌కుల‌తోనూ రాంనాథ్ కోవింద్ స‌మావేశ‌మ‌వుతారు. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నాలుగు అవ‌గాహ‌న ప‌త్రాల‌పై సంత‌కాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటున్న మా ప్ర‌తినిధి తెలియ‌జేస్తున్నారు.