ఆఫ్రికా ప్రధాన భూభాగంతో సంబంధాలు ఏర్పర్చుకునే భారతీయ కంపెనీల‌కు మారిషష్‌ ప్రధాన కేంద్రం వంటిందని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అన్నారు.

మారిష‌స్ భార‌తీయ కంపెనీల‌కు హ‌బ్‌గా సేవ‌లందించ‌వ‌చ్చ‌ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతానికి, ఆఫ్రికాకు మారిష‌స్ ప్ర‌ధాన ద్వారం వంటిద‌ని ఆయ‌న అన్నారు. మారిష‌స్ 50 వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌వింద్ జుగ‌నౌథ్ గౌర‌వార్థం ఏర్పాటు చేసిన విందు సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆయ‌న ఈ మాట‌ల‌న్నారు.మారిష‌స్‌కు భార‌త‌దేశంతో స‌హ‌జ సంబంధాలు ఉన్నాయ‌ని, ఇది హిందూ మ‌హాస‌ముద్ర‌ప్రాంతంలో కీల‌క‌మైన‌ద‌ని ఆయ‌న అన్నారు. ఇరు దేశాల మ‌ధ్య స‌ముద్ర‌యాన భ‌ద్ర‌త‌, ఉగ్ర‌వాదంపై పోరాటం వంటి వాటి విష‌యాల‌లో ద్వైపాక్షిక స‌హ‌కారం అద్భుతంగా ఉన్న‌ట్టు ఆయ‌న చెప్పారు. మారిష‌స్‌తో మ‌రింత స‌న్నిహిత స‌హ‌కారంతో క‌లిసి ప‌నిచేసేందుకు భార‌త‌దేశం ఆస‌క్తితో ఉన్న‌ట్టు రాష్ట్ర‌ప‌తి చెప్పారు.