ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు వారణాసిలో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు స్వాగతం ప‌లుకుతారు. అనంతరం ఇద్దరు నాయ‌కులు మీర్జాపూర్‌లో సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

ప్ర‌ధాన‌మంత్రి  న‌రేంద్ర మోదీ , ఈరోజు వార‌ణాశిలో  ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు స్వాగ‌తం ప‌లుకుతారు. అనంత‌రం ఇద్ద‌రు నాయ‌కులు మీర్జాపూర్ వెళ‌తారు. అక్క‌డ వారు, సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి తిరిగి వార‌ణాశి చేరుకుంటారు. వార‌ణాశిలో వారు దీన్ ద‌యాళ్ హ‌స్త‌క‌ళా సంకుల్‌ను సంద‌ర్శిస్తారు.అక్క‌డ హ‌స్త‌క‌ళాకారుల‌తో వారు ముచ్చ‌టించి , వారి హ‌స్త‌క‌ళా నైపుణ్యాల‌ను తిల‌కిస్తారు.అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, ఫ్రెంచ్ అధ్య‌క్షుడు మాక్రాన్‌లు వార‌ణాశిలోని ప్ర‌ముఖ అస్సీఘాట్‌కు వెళ‌తారు. అక్క‌డ వారు ప‌డ‌వ‌లో గంగాన‌ది ఘాట్‌ల‌ను సంద‌ర్శిస్తారు. ఫ్రెంచ్ అధ్య‌క్షుడి గౌర‌వార్ధం ప్ర‌ధాన‌మంత్రి ఈ మ‌ధ్యాహ్నం విందు ఇవ్వ‌నున్నారు.  వార‌ణాశిలోని మ‌ధువాధి రైల్వే స్టేష‌న్ నుంచి పాట్నావెళ్లే రైలును ప్ర‌ధాని ఈ మ‌ధ్యాహ్నం ప్రారంభిస్తారు. వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించ‌డంతోపాటు ప్ర‌ధాని ఈ రోజు డి.ఎల్‌.డ‌బ్ల్యు గ్రౌండ్స్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు.