రాజస్థాన్‌లో రాష్ట్ర అధ్యక్షుడితో సహా ముగ్గురు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ శాసనసభ్యులు బీజేపీలో చేరారు.

వివిధ రాష్ట్రాల‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తాపార్టీ 18 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ్ రాణే, బిజెపి జాతీయ కార్య‌ద‌ర్శి అనిల్ జైన్‌, స‌రోజ్ పాండే,బిజెపి అధికార ప్ర‌తినిధులు అనిల్ బ‌లూని, జివిఎల్ న‌ర‌సింహారావు ఉన్నారు. నారాయ‌ణ్ రాణేను మ‌హారాష్ట్ర‌నుంచి పోటీ చేయిస్తుండ‌గా, అనిల్ జైన్‌, జివిఎల్ న‌ర‌సింహారావుల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి పోటీ చేయిస్తున్నారు. స‌రోజ్ పాండే ఛ‌త్తీస్‌ఘ‌డ్‌నుంచి అనిల్ బ‌లూని ఉత్త‌రాఖండ్‌నుంచి పోటీచేస్తారు. కిరోడిలాల్ మీనా, మ‌ద‌న్‌లాల్ సైనిలు రాజ‌స్థాన్ నుంచి, కేర‌ళ బిజెపి రాష్ట్ర‌విభాగం మాజీ అధ్య‌క్షుడు వి. ముర‌ళీధ‌ర‌న్ మ‌హారాష్ట్ర నుంచి, అజ‌య్ ప్ర‌తాప్ సింగ్‌, కైలాశ్ సోనిలు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌నుంచి, వాణిజ్య‌వేత్త రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ క‌ర్ణాట‌క నుంచి, స‌మీర్ ఉర్నావ్ జార్ఖండ్ నుంచి లెఫ్టినెంట్ జన‌ర‌ల్ డి.పి. వాట్స్ హ‌ర్యానానుంచి పోటీ చేయ‌నున్నారు. రాజ్య‌స‌భ ద్వైవార్షిక ఎన్నిక‌లు ఈనెల 23న జ‌రుగుతాయి. నామినేష‌న్ల దాఖ‌లుకు ఈరోజు చివ‌రి రోజు