ఈ రోజు ఢిల్లీలో జ‌రిగే ఎండ్ టీబీ స‌మ్మిట్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రారంభిస్తారు.

ఢిల్లీలో ఎండ్ టీబీ శిఖ‌రాగ్ర స‌దస్సును ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఈ రోజు ప్రారంభిస్తారు.  ఆరోగ్య‌శాఖ, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, ఆగ్నేసియా ప్రాంతీయ కార్యాల‌యం, స్టాఫ్ టీబీ పార్ట్‌న‌ర్ షిప్ సంయుక్తంగా ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నాయి. క్ష‌య‌వ్యాధి ర‌హిత భార‌త‌దేశం పేరుతో  చేప‌ట్టే ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు.  క్ష‌య నిర్మూల‌న ప్ర‌చారాన్ని విస్ర్తృతంగా చేప‌ట్టేందుకు జాతీయ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తారు. క్ష‌య‌వ్యాధి పీడీతులంద‌రికీ అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప‌రీక్ష‌ల‌, చికిత్స‌, ఇత‌ర‌త్రా స‌హాయం అందించేందుకు వ‌చ్చే మూడేళ్ళ‌లో 12 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తారు. క్ష‌య‌వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారిని గుర్తించి వారు ప్రయివేటు రంగంలో చికిత్స ప‌రీక్ష‌ల కోసం ఇబ్బందులు ప‌డ‌కుండా జాతీయ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక కృషి చేస్తుంది. 2025 నాటికి క్ష‌య‌వ్యాధిని పూర్తిగా నిర్మూలించాల‌న్న ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ణాళిక‌ను అనుస‌రించి వ‌చ్చే ఐదేళ్ళ కాలంలో స‌వ‌రించిన జాతీయ క్ష‌య కార్య‌క్ర‌మ ల‌క్ష్యాల‌ను   నిర్ణ‌యించుకొని సుస్థిర అభివృద్ధి సాధించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు మా విలేఖ‌రి తెలియ‌జేస్తున్నారు.