చిల్ల‌ర ధ‌ర‌ల ద్ర‌వ్యోల్భ‌ణం జ‌న‌వ‌రిలో 5.07 శాతం నుంచి  ఫిబ్ర‌వ‌రికి 4.44 శాతానికి త‌గ్గింది.

చిల్ల‌ర వ‌స్తువుల రంగంలో ద్ర‌వ్యోల్భ‌ణం గ‌త జ‌న‌వ‌రితో పోలిస్తే ఫిబ్ర‌వ‌రిలో త‌గ్గింది. జ‌న‌వ‌రిలో 5.07 శాతం వున్న ఈ ద్ర‌వ్యోల్బ‌ణం ఫిబ్ర‌వ‌రిలో 4.44 శాతానికి త‌గ్గిన‌ట్టు గ‌ణంకాలు సూచిస్తున్నాయి. కూర‌గాయ‌ల ధ‌ర‌లు జ‌న‌వ‌రిలో 26.97 శాతంగావున్న‌, ద్ర‌వ్యోల్భ‌ణం ఫిబ్ర‌వ‌రికి 17.57 శాతానికి త‌గ్గిన‌ట్టు కేంద్ర గ‌ణాంక కార్యాల‌యం తెలిపింది. పండ్ల ధ‌ర‌ల‌కు సంబంధించి ద్ర‌వ్యోల్బ‌ణం జ‌న‌వ‌రిలో 6.24 శాతం నుంచిఒ 4.80 శాతానికి త‌గ్గింది.  ఇంధ‌నంలో 7.75 శాతం నుంచి 6.80 శాతానికి త‌గ్గింది. అయితే  ర‌వాణా, క‌మ్యూనికేష‌న్ల సేవ‌ల ధ‌ర‌లు 1.97 శాతం నుంచి 2.39 శాతానికి పెరిగాయి.  పారిశ్రామిక ఉత్ప‌త్తి, జ‌న‌వ‌రిలో 3.5 శాతం ఉండ‌గా, అది ఫిబ్ర‌వ‌రిలో 7.5 శాతానికి పెరిగింది.