భార‌త్‌, శ్రీలంక జ‌ట్ట‌మ‌ధ్య కొలోంబోలో గ‌త‌రాత్రి జ‌రిగిన క్రికెట్ మ్యాచ్‌లో భార‌త్ ఆరు వికెట్ల తేడాతో రెండో విజ‌యాన్ని సాధించింది.

భార‌త-శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల సీరీస్‌లో భాగంగా రాత్రి కొలొంబోలో జ‌రిగిన రెండో పోటీలో భార‌త్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించారు. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల‌కు 152 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ కౌశ‌ల్‌మెండిస్ 55ప‌రుగులు అత్య‌ధిక స్కోరు చేశాడు. మీడియం పేస‌ర్ Shardul ఠాకూర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. భార‌త జ‌ట్టు 9 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని చేధించి సీరీస్‌లో రెండో విజ‌యాన్ని అందుకుంది. మ‌నీష్‌పాండే 68 ప‌రుగులు, వికెట్ కీప‌ర్ దినేష్‌కార్తీక్ 42 ప‌రుగులు చేశారు. కార్తీక్ 39 నాటౌట్‌. Shardul మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.