హిందూ మ‌హాస‌ముద్రంలో అల్ప‌పీడ‌నం దృష్ట్యా కేర‌ళ తీర‌ప్రాంతాల్లో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌త ప్ర‌క‌టించింది.


హిందుమ‌హాస‌ముద్రంలో అల్ప‌పీడ‌నం దృష్ట్యా కేర‌ళ ప్రభుత్వం కోస్తా తీరం వెంట అప్ర‌మ‌త్త‌త ప్ర‌క‌టించింది. తిరువనంత‌పురంలో ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. స‌ముద్రంలోకి చేప‌ట‌వేట‌కు వెళ్ళిన మ‌త్స్య‌కారుల‌ను తిరిగిర‌ప్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం అధికారుల‌ను ఆదేశించింది. వారిని వెన‌క్కి తీసుక‌వ‌చ్చే విష‌యంలో నౌకాద‌ళం, తీర‌ర‌క్ష‌క ద‌ళం సహాయం కోరిన‌ట్టు అధికారులు తెలియ‌జేశారు. అల్ప‌పీడ‌నం ఉధృత‌మై వాయిగుండంగా మార‌నుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ చేసిన హెచ్చ‌రిక‌తో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.