కర్నాటక, తమిళ నాడు, కేరళ, పుదుచ్చేరి ల మధ్య కావేరి జలాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కావేరి మానేజ్ మెంట్ స్కీం ముసాయదాను సుప్రీమ్ కోర్టు కు సమర్పించింది.

క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, పుదుచ్చేరిల మ‌ధ్య కావేరి న‌దీ జ‌లాల పంపిణీ సాఫీగా జ‌రిగేందుకు సంబంధించి కావేరి యాజ‌మాన్య‌ప‌థ‌కం ముసాయిదాను కేంద్ర‌ప్ర‌భుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది. కేంద్ర‌జ‌ల‌వ‌న‌రుల కార్య‌ద‌ర్శి స‌మ‌ర్పించిన ఈ ముసాయిదా ప‌థ‌కాన్ని ప్ర‌ధాన‌న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ఏ.ఎమ్‌.ఖ‌న్వీల్‌క‌ర్‌, డి.వై.చంద్ర‌చూడ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్వీక‌రించి దానిని చ‌దువుతామ‌ని చెప్పింది. అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పున‌కు అది అనుగుణంగా వుందో లేదో ప‌రిశీలించాల్సి వుంద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ప‌థ‌కాన్ని ప‌రిశీలించి ఈనెల 16న ఆమోదం తెలుపుతామ‌ని తెలియ‌జేసింది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డిగా వున్న కావేరి వివాదంపై త‌న తీర్పున‌నుస‌రించి ఒక ప‌థ‌కాన్ని రూపొందించాల‌ని ఫిబ్ర‌వ‌రి 16న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.