దేశంలో వివిధ ప్రాంతాల్లో సంభ‌వించిన ధూళి తుపానులో ప‌లువురు మ‌ర‌ణించారు. ఈ విష‌య‌మై రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ విచారం వ్య‌క్తం చేశారు. వాయ‌వ్య‌, తూర్పు, ద‌క్షిణ భార‌త‌దేశంలో వ‌చ్చే 2, 3 రోజుల పాటు ఉరుములుతో కూడిన వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

ఢిల్లీలోనూ, ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో సంభవించి ధూళితుపానులో  ప‌లువురు మ‌ర‌ణించారు.  ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 38 మంది మరణించారు. బెంగాల్ లో 12 మంది. ఆంధ్రప్రదేశ్ లో 12 మంది, ఢిల్లీలో ఇద్దరు మరణించారు. గంటకు 109 కిలోమీటర్ల వేగంతో ధూళి , పెనుగాలుల తో కూడిన భారీ  వ‌ర్షం  ఢిల్లీలో కురింసింది. ధూళి తుపానులో పలువురు మరణించడం పట్ల రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.వాయవ్య భారతంలో  వాతావరణ పరిస్థితుల వల్ల ఈ అకాల వర్షాలు సంభవించినట్టు వాతావరణ శాఖ  తెలిపింది. ఆకాశవాణి విలేఖరితో తావరణ శాఖ అధికారి మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ ఉరుములతో కూడిన పెనుగాలులు వచ్చే రెండు మూడు రోజుల్లో కొనసాగుతాయని చెప్పారు. వాయవ్య, తూర్పు, దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ఇవి కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.