పశ్చిమ Bengalలో ఈ రోజు పంచాయత్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో హింసా కాండ పైన నివేదిక సమర్పించాలని కేంద్ర Home మంత్రిత్వ శాఖ పశ్చిమ Bengal ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప‌శ్చిమ‌బెంగాల్ పంచాయ‌తీ ఎన్నిక‌లు ఈరోజు గ‌ట్టి భ‌ద్ర‌త మ‌ధ్య జ‌రిగాయి. 621 జిల్లా ప‌రిష‌త్తులు, 6వేల‌కు పైగా పంచాయ‌తీ స‌మితులు, దాదాపు 31వేల గ్రామ‌పంచాయ‌తీల‌లో ఓటింగు జ‌రిగింది. పోలింగు ఉద‌యం 7గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. ఓట్ల‌లెక్కింపు గురువారం నాడు చేప‌డ‌తారు. చాలా ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం అందింద‌ని ఆకాశ‌వాణి కోల్‌క‌తా విలేఖ‌రి తెలియ‌జేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా 4గురు వ్య‌క్తులు చ‌నిపోయారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఒక‌వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.