అమెరికాతో సియోల్ సంయుక్త సైనక విన్యాసాలకు సంబంధించి దక్షిణ కొరియాతో ఈరోజు జరగవలసిన ఉన్నతస్థాయి చర్చలకు ఉత్తరకొరియా రద్దు చేసుకుంది.

అమెరికాతో దక్షిణ కొరియా తలపెట్టిన సంయుక్త సైనకి విన్యాసాల గురించి చర్చలను ఉత్తరకొరియా ఈరోజు రద్దు చేసింది. అమెరికా, దక్షిణ కొరియాకు చెందిన దాదాపు 100 యుద్ధ విమానాలు గత శుక్రవారం నాడు మ్యాక్స్ థండర్ డ్రిల్ నిర్వహించాయి. ఈ విన్యాసాలు తనని రెచ్చగొట్టేందుకు తనపై దాడికి ఆదేశాలు సిద్దమవుతున్నాయని… ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. ఈ విన్యాసాలు ఇలాగే కొనసాగితే వచ్చే నెల 12వ తేదీన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీ తమ నాయకులు కిమ్ జోంగ్ ఉన్ తో సమావేశం కూడా రద్దు చేస్తానని ఉత్తర కొరియా హెచ్చరిస్తోంది.