ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ భీమ్ లు కూలిపోయిన ఘటనలో 18 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్ వారణాసిలో నిన్న రైల్వే స్టేషన్  సమీపంలో నిర్మాణంలోఉన్న ఫ్లైఓవర్ బీములు కూలిపోయిన ఘటనలో 18 మంది చనిపోయారు. రెండు భీములు కూలిపోయినందుకు ఉత్తరపర్దేశ్ బ్రిడ్జి కార్పొరేషన్ ప్రాజెక్టులు చీఫ్ మేనేజర్ తో సహా నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సహాయ పునరవాస చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈమేరకు ఒక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల ఉన్నతాధికార సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లో తమ నివేధికన సమర్పిస్తోంది. కాగా ఈ ప్రమాదంలో 325 మందితో 7 ఎన్.డిఆర్.ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. జాతీయ రహదారుల సాధికార సంస్థ భారి క్రేన్ల ద్వారా కూలిపోయిన బీమ్ లను తొలిగిస్తున్నారు.