పశ్చిమ బెంగాల్ లో 20 జిల్లాలో 568 పోలింగ్ బూత్ లలో ఈరోజు తిరిగి పోలింగ్ జరుగుతుంది.

పశ్చిమ బెంగాల్ లో 20 జిల్లాలో 568 పోలింగ్ బూత్ లలో ఈరోజు తిరిగి పోలింగ్ జరుగుతుంది. మొన్నటి పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్రాల ఎన్నికల సంఘం రేపు పోలింగ్ కు ఆదేశించింది. ఆ సంఘటనల్లో కనీసం 12 మంది మృతి చెందగా.. 43 మంది గాయపడ్డారు. ముర్షిరాబాద్ జిల్లాలో 63 చోట్లకూచి బెహార్ లో 57, పశ్చిమ మిడ్నాఫర్ లో 28, హుగ్లీ జిల్లాలో 10 పంచాయతీలలో సహా మొత్తం 568 బూత్ లలో రీ-పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు ప్రాంభమయి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రేపు ఓట్లు లెక్కిస్తారు. పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల పట్ల ప్రధానమంత్రి  నరేంద్రమోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో ఉన్నతమైన రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమనిఆయన నిన్న న్యూఢిల్లీలో బిజెపి కార్యకర్తల సమావేశంలో అన్నారు.