బంగ్లాదేశ్ లో అభివృద్ధి కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియా బెయిల్ మంజూరు చేసింది.

విదేశీ విరాళాలను దుర్వినియోగం చేసిన కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి  ఖలేద్ జియా ఆదేశ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. జియా అనాథ శరణాలయం ట్రస్టుకు వచ్చిన 21 మిలియన్ టాకాలు అంటే 2 లక్షల 50 వేల అమెరికా డాలర్లను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపైన ఫిబ్రవరి 8వ తేదీన 72 ఏళ్ల ఖలేద్ జియాకు ఐదేళ్ల కారాగాల శిక్ష విధించారు. మార్చి 12వ తేదీన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూర చేసింది. తర్వాత అవినీతి నిరోధక సంఘం ప్రభుత్వం ఈ ఉత్తర్వును అప్పీలేట్ డివిజన్ ల్ సవాల్ చేశాయి.