మనదేశం పునర్ వినియోగం ఇంధనాన్ని 175 గిగా వాట్ల మేరకు ఉత్పత్తి చేయనున్నట్లు పెట్రోలియం, ఖనిజ శాఖ మంత్రి ధర్మంద్ర ప్రదాన్ తెలియజేశారు.

మనదేశంలో పునర్ వినియోగం ఇంధనం 175 గిగా వాట్ల మేరకు ఉత్పత్తి జరగనున్నట్లు పెట్రోలియం ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. సౌర శక్తి, పవన విద్యుత్,  బయో సిఎన్.జి. మొదలైన వనరుల ద్వారా ఈ పునర్వినియోగం  ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తామని చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ 3 రోజుపాటు తన పర్యటన ముగిస్తూ.. మనదేశం  పునర్ వినియోగం అగ్రగామిగా ఉందని అతి తక్కువ సమయంలోనే  మంచి ఫలితాలు సాధించిందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో భారత దేశంలో ఉత్పత్తి అయ్యే వివిధ రకాల పునర్ వినియోగల ఇంధనానికి వివిధ వర్గాల నుంచి డిమాండ్ ఉన్నట్లు ఆయన చెప్పారు.