కేంద్ర ప్ర‌భుత్వం నిన్న దేశ వ్యాప్తంగా వైఫై సేవ‌లందించే 5 వేల ఉమ్మ‌డి సేవా కేంద్రాలు – CSCల‌ను ప్రారంభించింది.

కేంద్ర ప్ర‌భుత్వం నిన్న దేశ వ్యాప్తంగా వైఫై సేవ‌లందించే 5 వేల ఉమ్మ‌డి సేవా కేంద్రాలు-CSCల‌ను ప్రారంభించింది. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను గ్రామీణుల‌కు మ‌రింత చేరువ చేయ‌డ‌మే ఈ కేంద్రాల ల‌క్ష్యం. ఇందులో భాగంగా CSCలు తొలివిడ‌త‌లో రైల్వే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తాయి. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, IT శాఖ‌, రైల్వే శాఖ రెండు అవ‌గాహ‌న ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఆ శాఖ మంత్రులు ర‌విశంక‌ర్ ప్ర‌సాద్, పీయూష్ గోయ‌ల్ పాల్గొని ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. తొలి ఒప్పందం ప్ర‌కారం CSCలు మొత్తం 2 ల‌క్ష‌ల 90 వేల రైల్వే టిక్కెట్ల‌ను, రెండ‌వ ఒప్పందం ప్ర‌కారం సాధార‌ణ త‌ర‌గ‌తి టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తాయి. ఈ సంద‌ర్భంగా పీయూష్ గోయ‌ల్ మాట్లాడుతూ – CSCలు త్వ‌ర‌లో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ క‌ర‌స్పాండెంట్లుగా కూడా ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. భారత్ నెట్ ద్వారా గ్రామీణ ఇంటర్ నెట్ కనెక్టివిటీ పెంచడం ఈ చర్య లక్ష్యం. సామాన్య మానవుడిని సాదికరుడిని చేసేందుకు CSCల ద్వారా డిజిటీకరణ భారీ ఉద్యమం ఇక జరగనున్నట్లు చెప్తూ  Prasad – ప్రధాన మంత్రి CSC-VLEలను ఉద్దేశించి ఈ నెల 15వ తేదీన ప్రసంగిస్తారని చెప్పారు.<>