పరారీలో ఉన్న నేరస్తుల విషయంలో పూర్తి సహకారం అందిస్తానని బ్రిటన్ మన దేశానికి హామీ ఇచ్చింది.

తన భూభాగం పైన భారత్ వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని మన దేశం యునైటెడ్ కింగ్ డమ్ ను కోరింది.  న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంశాఖ సహయమంత్రి కిరెణ్ రిజుజూ – UK ఉగ్రవాద వ్యతిరేక శాఖ మంత్రి బ్యారోనెస్ విలియమ్స్ కి ఈ విషయం చెప్పారు. ఉగ్రవాదం గురించి స్పష్టమైన దృక్పథం ఉండాలని ఆయన చెప్పారు. ఇద్దరు మంత్రుల మధ్య వలస, తీవ్రవాదం, నేరస్థుల అప్పగింత, క్రిమినల్ పత్రాల పంపిణీ మొదలైన అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది అంటూ రిజుజూ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, మనీ లాండరింగ్ మొదలైన వాటి నియంత్రణకు ఆర్థిక కార్యాచరణ టాస్క్ ఫోర్స్ చేసిన సిఫారసులను అమలు చేయాలని చెప్పారు. ఆర్థిక నేరాలకు సంబంధించి పరారీలో ఉన్న భారతీయుల విషయంలో బ్రిటన్ చర్య తీసుకోవాలని, వివిధ దేశాల్లో నేరాలు చేసిన వారు బ్రిటన్ కు పారిపోయి సురక్షితంగా తలదాచుకోవచ్చునన్న నమ్మకాన్ని వమ్ము చేయాలని ఆయన చెప్పారు. బ్రిటన్ లో ఇందుకు సంబంధించిన చట్టాలను భారత్ పూర్తిగా గౌరవిస్తున్నదని, అయితే UK ప్రభుత్వం తమకు సహకరిస్తున్నామని భావిస్తున్నామని రిజుజూ – UK మంత్రికి తెలియజేశారు.