ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైన హత్యా యత్నం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైన హత్యా యత్నం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ మొదలైన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అన్నిసంస్థల సమన్వయంతో మరిన్ని చర్యలు తీసుకోవాలని సింగ్ ఆదేశించినట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. మావోయిస్టు సంస్థలతో సంబంధం ఉన్న కొందరు ప్రధానమంత్రిని లక్ష్యం గా చేసుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు కనుగొన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.