సింగపూర్ సెంటొసా ద్వీపంలో చారిత్రాత్మకమైన సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జంగ్ యున్ ఒక సంయుక్త పత్రం పైన ఈరోజు సంతకాలు చేశారు.

సింగపూర్ సెంటొసా ద్వీపంలో చారిత్రాత్మకమైన సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జంగ్ యున్ ఒక సంయుక్త పత్రంపైన ఈరోజు సంతకాలు చేశారు. ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ట్రంప్ – ఈ పత్రం సమగ్రంగా ఉందని చెప్పారు కానీ వివరాలు వెల్లడించలేదు. శిఖరాగ్ర చర్చల ద్వారా తనకు, కిమ్ కు మధ్య ఒక అపురూపమైన అనుబంధం ఏర్పడిందని.. ఊహించిన దానికంటే చర్చలు చాలా ఫలవంతంగా జరిగాయని ఆయన చెప్పారు. అణ్వస్త్ర నిరాయుధీకరణ పైన ఒప్పందం కుదిరిందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన – ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. కొరియా ద్వీపకల్పంతో అమెరికా సంబంధాలు ఇకపై భిన్నంగా ఉంటాయని ఆయన చెప్పారు. కిం మాట్లాడుతూ గతాన్ని వెనకే విడిచిపెట్టి.. ప్రపంచానికి కొత్త మార్పు చూపనున్నామని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మామూలు స్థాయికి తెచ్చి, అణ్వస్త్ర నిరాయుధీకరణ జరిగేల చూసేందుకు ప్రతినిధి స్థాయి చర్చలకి ముందు ఇద్దరు నాయకులు 45 నిముషాలపాటు ముఖాముఖీ సమావేశం జరిపారు.