ఆర్ జే డి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి చెందిన కంపెనీకి చెందిన పట్నాలోని 44 కోట్ల 75 లక్షల విలువైన 11 స్థలాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.

ఐఆర్ సీటీసీ హోటల్ మనీ లాండరింగ్ కేసులో ఆర్ జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి సంబంధించిన 44 కోట్ల 75 లక్షల రూపాయల విలువ గల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ – ఇడి స్వాధీనం చేసుకుంది. పట్నాలోని 11 ఇళ్ల స్థలాలను ఇడి స్వాధీనం చేసుకుంది. ఈ స్థలాలు మొత్తం కొలత 3 ఎకరాల వరకు ఉంది. బీహార్ రాజధాని పట్నా సమీపంలోని ధనపుార్ లో ఈ స్థలాలున్నాయి. పీఎంఎల్ ఏ చట్టం కింద గత సంవత్సరం జులైలో ఇడి లాలూ ప్రసాద్ పైన, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.