ప్రధానమంత్రి నరేంద్రమోది ఎన్ డీఏ ప్రభుత్వ ప్రధాన పథకాల పురోగతిని సమీక్షించేందుకు ఈ రోజు కొత్త ఢిల్లీలో మంత్రిమండలి సమావేశం నిర్వహిస్తారు

ప్రధానమంత్రి నరేంద్రమోది ఈ రోజు మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ డీఏ పథకాలు, ఇతర అంశాలతో కూడిన ఎజెండాపై ఆయన సమీక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ హౌస్ లో జరిగే ఈ కీలక సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని మంత్రులను ప్రభుత్వం కోరింది. వ్యవసాయ రంగ సమస్యలను, రైతులకు అందిస్తున్న సహాయాన్ని ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, అంకుర పరిశ్రమల నిధి పథకం, ముద్రా యోజన తదితర పథకాలపై సమీక్షిస్తారని భావిస్తున్నారు.