రష్యా నగరం కస్పి ఇస్క్ లో నిన్న ఉమకనవ్ స్మారక టోర్నమెంట్ లో భారత బాక్సర్లు ఒక బంగారు, రెండు రజత పతకాలు సాధించారు.

రష్యా నగరం కస్పి ఇస్క్ లో నిన్న ఉమకనవ్ స్మారక టోర్నమెంట్ లో భారత బాక్సర్లు ఒక బంగారు, రెండు రజత పతకాలు సాధించారు. 75 కిలోల విభాగంలో సవిటిబోరా బంగారు పతకం సాధించారు. ఆమె ఫైనల్ మ్యాచ్ లో రష్యా ప్రముఖ క్రీడాకారిని అన్నా అనిఫినో జెనోవాను ఓడించి పతకం సాధించారు. పురుషుల విభాగంలో బ్రిజేష్ యాదవ్ 81 కిలోల విభాగంలో, విరేంద్ర కుమార్ 91 కిలోల విభాగంలో రజతాలు సాధించారు.